TDP: మాది ప్రజా ప్రభుత్వం.. ప్రచార ప్రభుత్వం కాదు: తెదేపా ఎంపీ కలిశెట్టి

తమది కూల్చే ప్రభుత్వం కాదని.. ఆస్తులు కాపాడే ప్రభుత్వమని విజయనగరం తెదేపా ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు.

Updated : 13 Jun 2024 16:02 IST

విశాఖ: తమది కూల్చే ప్రభుత్వం కాదని.. ఆస్తులు కాపాడే ప్రభుత్వమని విజయనగరం తెదేపా ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. విశాఖలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉత్తరాంధ్రకు సీఎం చంద్రబాబు ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు. విశాఖ నగరాన్ని ఆర్థిక రాజధానిగా ప్రకటించారన్నారు. ఒక కేంద్ర మంత్రి పదవి ఉత్తరాంధ్రకు ఇచ్చారని చెప్పారు. కూటమిది ప్రజా ప్రభుత్వమని.. ప్రచార ప్రభుత్వం కాదని తెలిపారు. ప్రభుత్వ ఆస్తులు కూల్చే ప్రభుత్వాన్ని చూశామని.. ఇప్పుడు ప్రజా ఆస్తులు కాపాడే ప్రభుత్వాన్ని చూస్తారని చెప్పారు. విజయనగరంలో జరిగిన భూ అక్రమాలపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ఉత్తరాంధ్ర నీటిపారుదల ప్రాజెక్టులపై అధ్యయనం చేస్తున్నట్లు అప్పలనాయుడు వివరించారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని