
Published : 31 Jan 2021 01:32 IST
వైకాపా పాలనలోనే దాడులు పెరిగాయ్: కనకమేడల
దిల్లీ: అఖిలపక్ష సమావేశాల్లో ఏమీ అడగకుండానే అన్నీ అడిగినట్లు ప్రకటనలు ఇవ్వడంతోనే వైకాపా కుట్ర బయటపడిందని తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ అన్నారు. దిల్లీలో అఖిలపక్ష సమావేశం అనంతరం తెదేపా ఎంపీ గల్లా జయదేవ్‌తో పాటు కనకమేడల మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన భేటీలో రాష్ట్ర సమస్యలు ప్రస్తావించకుండా కేవలం దేవాలయాలపై దాడుల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారని విమర్శించారు. ప్రతిపక్షాలపై బురద చల్లేందుకు వీలుగా అఖిలపక్ష భేటీని వైకాపా నేతలు ఉపయోగించుకున్నారని కనకమేడల ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వైకాపా అధికారంలోకి వచ్చాకే దేవాలయాలపై దాడులు పెరిగాయన్నారు. సీఎం జగన్ పాలనలోనే ఇలాంటి దాడులెందుకు జరుగుతున్నాయని ప్రశ్నించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో చోటుచేసుకున్న 147 ఘటనలపై వైకాపా ప్రభుత్వం జవాబు చెప్పాల్సిఉందన్నారు.
ఇవీ చదవండి..
Tags :