Kesineni Nani: ఏపీ రోజురోజుకూ అప్పుల ఊబిలో కూరుకుపోతోంది: ఎంపీ కేశినేని నాని

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రోజురోజుకూ అప్పుల ఊబిలో కూరుకుపోతోందని తెదేపా ఎంపీ కేశినేని నాని అన్నారు.

Updated : 09 Feb 2022 04:06 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రోజురోజుకూ అప్పుల ఊబిలో కూరుకుపోతోందని విజయవాడ తెదేపా ఎంపీ కేశినేని నాని అన్నారు. అప్పుల కోసం ప్రభుత్వం అమరావతి భూములను తాకట్టు పెట్టిందన్నారు. పోలవరం ప్రాజెక్ట్‌ను రాష్ట్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఏపీ ఆర్థిక క్రమశిక్షణ పాటించేలా కేంద్రం చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా, రైల్వే జోన్‌, వెనకబడిన జిల్లాలకు కేంద్రం నిధులివ్వాలని కేశినాని కోరారు. బడ్జెట్‌ కేటాయింపుపై లోక్‌సభలో జరిగిన చర్చలో భాగంగా కేశినేని ఈ అంశాలు లేవనెత్తారు. 
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని