TDP: సీఐడీ చీఫ్‌ సంజయ్‌పై చర్యలు తీసుకోండి: అమిత్‌షాకు తెదేపా ఎంపీ రామ్మోహన్‌ ఫిర్యాదు

ఏపీ సీఐడీ చీఫ్‌ సంజయ్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు తెదేపా ఎంపీ రామ్మోహన్‌నాయుడు ఫిర్యాదు చేశారు. సర్వీస్‌ రూల్స్‌ను అతిక్రమించి వైకాపాకు తొత్తుగా సీఐడీ చీఫ్‌ పనిచేస్తున్నారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. 

Updated : 28 Sep 2023 14:06 IST

అమరావతి: ఏపీ సీఐడీ చీఫ్‌ సంజయ్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు తెదేపా ఎంపీ రామ్మోహన్‌నాయుడు ఫిర్యాదు చేశారు. సర్వీస్‌ రూల్స్‌ను అతిక్రమించి వైకాపాకు తొత్తుగా సీఐడీ చీఫ్‌ పనిచేస్తున్నారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు ఎంపీ లేఖ రాశారు. సంజయ్‌పై చర్యలు తీసుకోవాలంటూ సంబంధిత ఆధారాలను జతచేశారు.

‘‘విచారణ లేకుండా స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో తెదేపా అధినేత చంద్రబాబును అరెస్ట్‌ చేశారు. రాజకీయ పక్షపాతాలు లేకుండా పనిచేయాల్సిన సీఐడీ చీఫ్‌ అన్నీ ఉల్లంఘించారు. సీఎం జగన్‌ మెప్పు కోసం ప్రతిపక్షాలపై బురద చల్లుతున్నారు. సర్వీసు నిబంధనలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రెస్‌మీట్లు పెడుతున్నారు. దర్యాప్తు అంశాలను గోప్యంగా ఉంచాల్సిన సీఐడీ అధికారులు ఉద్దేశపూర్వకంగానే చంద్రబాబు పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగిస్తున్నారు’’ అని రామ్మోహన్‌నాయుడు తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని