Chandrababu Arrest: హైదరాబాద్‌లో ప్రదర్శనలు చేయొద్దంటే ఎలా?: తెదేపా మహిళా నేత జ్యోత్స్న

తెలంగాణ మంత్రి కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై తెదేపా జాతీయ అధికార ప్రతినిధి జ్యోత్స్న స్పందించారు.

Published : 26 Sep 2023 18:35 IST

హైదరాబాద్‌: తెదేపా అధినేత చంద్రబాబు అరెస్టు అంశంపై తెలంగాణ మంత్రి కేటీఆర్‌ స్పందించిన విషయం తెలిసిందే. కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై తెదేపా జాతీయ అధికార ప్రతినిధి జ్యోత్స్న స్పందించారు. ‘‘శాంతియుత ప్రదర్శనలు కూడా చేయొద్దా? హైదరాబాద్‌ను అభివృద్ధి చేసిన దార్శనికుడు చంద్రబాబు. ఆయన కోసం హైదరాబాద్‌లో ప్రదర్శనలు చేయొద్దా? మీరు మాత్రం దిల్లీ, మహారాష్ట్రలో ధర్నాలు చేయొచ్చా?. తెలంగాణ భారతదేశంలో లేదా? మేం భారతీయులం కాదా? మాకు హక్కులు లేవా?’’ అని ప్రశ్నించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని