
Andhra News: తెదేపా మహానాడు తీర్మానాలకు ఆమోదం తెలిపిన పొలిట్‌బ్యూరో
అమరావతి: ఒంగోలులో జరిగిన తెదేపా పొలిట్ బ్యూరో సమావేశం ముగిసింది. మే 27వ తేదీ (శుక్రవారం) నుంచి ఒంగోలులో తెదేపా మహానాడు జరగనుంది. ఈనేపథ్యంలో పలు అంశాలపై చర్చ జరిగింది. మహానాడు తీర్మానాలకు పొలిట్‌బ్యూరో ఆమోదం తెలిపింది. ప్రజాప్రతినిధుల సభలో మొత్తం 17 తీర్మానాలు చేశారు. వీటిలో ఏపీకి 12, తెలంగాణకు 3, అండమాన్‌కు ఒక తీర్మానం ఉంది. రాజకీయ తీర్మానంపై పొలిట్ బ్యూరోలో కీలక చర్చ జరిగింది. రాష్ట్ర ప్రయోజనాల మేరకు తీర్మానం ఉండాలని నేతలు అభిప్రాయపడ్డారు.
వైకాపా బస్సు యాత్రపై పొలిట్ బ్యూరోలో ప్రస్తావన వచ్చింది. బస్సు యాత్ర ఓ డ్రామా అంటూ చర్చ జరిగింది. వైకాపా 9 మంది రాజ్యసభ సభ్యుల్లో నలుగురు రెడ్డి వర్గం వారేనని నేతలు గుర్తుచేశారు. లాబీయింగ్ చేసేవారికి రాజ్యసభ సీటు ఇచ్చారని ఈ సందర్భంగా తెదేపా అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. వైకాపా బస్సు యాత్రను ప్రజలు పట్టించుకోవట్లేదని పలువురు నేతలు వ్యాఖ్యానించారు. ఈ భేటీలో ఏపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికపై కళా వెంకట్రావు ప్రస్తావించారు. ఎంబీసీ నుంచి కొత్తవారికి ఏపీ అధ్యక్ష పదవి ఇస్తే బాగుంటుందని సూచించారు. ఇక ఇప్పటికే ఒంగోలు పసుపువర్ణ శోభితం అయింది. మహానాడుకు పార్టీ శ్రేణులు తరలివస్తున్నాయి. పలు జిల్లాల నుంచి కార్లు, ద్విచక్రవాహనాలపై కార్యకర్తలు భారీగా ఒంగోలుకు చేరుకుంటున్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Alluri Sitarama Raju: వెండితెరపై వెలిగిన మన్యం వీరులు వీరే..
-
Sports News
Jasprit Bumrah: ఇంగ్లాండ్ గడ్డపై బుమ్రా మరో రికార్డు..
-
Politics News
Talasani: మోదీజీ.. కేసీఆర్ ప్రశ్నలకు సమాధానాలేవీ?: తలసాని
-
World News
Sri Lanka: శ్రీలంకలో పాఠశాలల మూసివేత..మరోమారు భారత్ ఇంధన సాయం
-
General News
Raghurama: రఘురామకృష్ణరాజు ఇంటి వద్ద వ్యక్తి హల్చల్
-
General News
PM Modi: గన్నవరం చేరుకున్న ప్రధాని మోదీ.. స్వాగతం పలికిన గవర్నర్, సీఎం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Cyber Crime: ఆన్లైన్ మోసానికి సాఫ్ట్వేర్ ఉద్యోగిని బలి!
- బిగించారు..ముగిస్తారా..?
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (04-07-2022)
- Raghurama: ఏపీ పోలీసులు ఫాలో అవుతున్నారని రైలు దిగిపోయిన ఎంపీ రఘురామ
- భార్యతో అసహజ శృంగారం.. రూ.కోటి ఇవ్వాలని డిమాండ్
- ప్రేమ పెళ్లి చేసుకున్నాడని మట్టుబెట్టారు
- IND vs ENG: బుమ్రా స్టన్నింగ్ క్యాచ్.. బెన్‌స్టోక్స్‌ను ఎలా ఔట్ చేశాడో చూడండి
- cook yadamma : ఔరౌర పెసర గారె.. అయ్యారె సకినాలు..!
- Hyderabad News: నన్ను లోనికి రానివ్వలేదనేది దుష్ప్రచారమే: యాదమ్మ
- Naresh: ముదిరిన నరేశ్ కుటుంబ వివాదం.. పవిత్రను చెప్పుతో కొట్టబోయిన రమ్య