Updated : 26 May 2022 13:46 IST

TDP Mahanadu: ‘మహానాడు’కు భారీ ర్యాలీగా తరలి వెళ్లిన చంద్రబాబు.. తెదేపా శ్రేణులు

అమరావతి: ఒంగోలులో రేపటి నుంచి ప్రారంభం కానున్న తెదేపా మహానాడుకు ఆ పార్టీ శ్రేణులు తరలి వెళ్తున్నాయి. అన్ని జిల్లాల నుంచి ముఖ్యనేతలు, కార్యకర్తలు ఒంగోలు చేరుకుంటున్నారు. తెదేపా అధినేత చంద్రబాబు, ఇతర నేతలు భారీ ర్యాలీగా మహానాడుకు బయల్దేరారు. మంగళగిరి నుంచి కార్లు, ద్విచక్ర వాహనాలతో తరలి వెళ్లారు. వందల సంఖ్యలో వాహనాలు చంద్రబాబు కాన్వాయ్‌ను అనుసరించాయి. 

మార్గమధ్యంలో చిలకలూరిపేట, మార్టూరు, అద్దంకి ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు ర్యాలీలో కలవనున్నాయి. మధ్యాహ్నం 1.30 గంటలకు ఒంగోలు నగర పరిధిలోని త్రోవగుంట వద్దకు చంద్రబాబు చేరుకుంటారు. అక్కడి నుంచి మంగమూరు రోడ్డు, మున్సిపల్‌ కార్యాలయం, చర్చిసెంటర్‌ మీదుగా హోటల్‌ సరోవర్‌కు చేరతారు. సాయంత్రం తెదేపా పొలిట్‌ బ్యూరో సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో మహానాడులో చర్చించాల్సిన అంశాలు, తీర్మానాలపై నిర్ణయం తీసుకునే అవకాశముంది.



Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని