Andhra News: రివర్స్‌ డ్రామా ఆడకుంటే ఈ పాటికి పోలవరం పూర్తయ్యేది: దేవినేని ఉమ

రివర్స్‌ డ్రామా ఆడకుంటే ఈ పాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేది అని మాజీ మంత్రి దేవినేని ఉమ అన్నారు. పోలవరం నిర్వాసితుల ద్రోహిగా జగన్‌ మిగిలిపోతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పోలవరంపై

Updated : 05 Mar 2022 12:14 IST

అమరావతి: రివర్స్‌ డ్రామా ఆడకుంటే ఈ పాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేది అని మాజీ మంత్రి దేవినేని ఉమ అన్నారు. పోలవరం నిర్వాసితుల ద్రోహిగా సీఎం జగన్‌ మిగిలిపోతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పోలవరంపై సీఎం పలు సందర్భాల్లో మాట్లాడిన వీడియోలను ఆయన ప్రదర్శించారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో దేవినేని ఉమ మీడియాతో మాట్లాడారు.

‘‘పోలవరాన్ని నిన్న కేంద్రమంత్రి షెకావత్‌ సందర్శించారు. నిర్వాసితులకు బాగుందని చెప్పించడానికి జగన్‌ ప్రయత్నించారు. పునరావాసం కింద ఇళ్లు ఎప్పుడు పూర్తి చేస్తారో చెప్పలేని పరిస్థితి సీఎంది. కేంద్ర మంత్రి పరిశీలనకు వస్తే రాష్ట్ర జలవనరుల మంత్రి అడ్రస్సు లేదు. కావాల్సినవి అడగడంలో సీఎం జగన్‌ విఫలమయ్యారు. 28 మంది ఎంపీలు ఉండి ఆర్థిక అనుమతులు పొందలేకపోయారు. స్వార్థ ప్రయోజనాల కోసం పోలవరం తాకట్టు పెడుతున్నారు. సీబీఐ, ఈడీ, బాబాయి హత్య కేసు నుంచి తప్పించుకునేందుకే ఆరాటం’’ అని దేవినేని ఉమ ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని