Andhra News: నారాయణ విద్యా సంస్థలంటే ఆషామాషీగా ఉందా?: సోమిరెడ్డి

తెదేపాకు చెందిన మాజీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల అధినేత పొంగూరు నారాయణను పోలీసులు అరెస్టు చేయడంపై ఆ పార్టీ సీనియర్‌ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు.

Published : 10 May 2022 14:55 IST

అమరావతి: తెదేపాకు చెందిన మాజీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల అధినేత పొంగూరు నారాయణను పోలీసులు అరెస్టు చేయడంపై ఆ పార్టీ సీనియర్‌ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. నారాయణ విద్యా సంస్థలంటే అంత ఆషామాషీగా ఉందా? అని ప్రశ్నించారు. 6 లక్షల మందికిపైగా విద్యార్థులు, 60 వేల మంది ఉద్యోగులతో దేశవ్యాప్తంగా 23 రాష్ట్రాల్లో నారాయణ విద్యాసంస్థలు పనిచేస్తున్నాయని చెప్పారు.

ప్రస్తుతం విద్యాసంస్థల బాధ్యతను నారాయణ పిల్లలు చూసుకుంటున్నారని.. రాజకీయాల్లోకి వచ్చాక విద్యాసంస్థల బాధ్యతను ఆయన పూర్తిగా వదిలేశారని సోమిరెడ్డి పేర్కొన్నారు. నారాయణ విద్యా సంస్థల్లో ఎవరైనా తప్పు చేస్తే ఛైర్మన్‌ను అరెస్టు చేస్తారా? అని ప్రశ్నించారు. విద్యాశాఖలో లీకేజీపై ఆ శాఖ మంత్రిని కూడా అరెస్టు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. కక్షపూరిత రాజకీయాలకు ఇప్పటికైనా వైకాపా స్వస్తి పలకాలని సోమిరెడ్డి హితవు పలికారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని