Andhra News: తెదేపా సీనియర్‌ నేత యడ్లపాటి వెంకట్రావు కన్నుమూత

తెదేపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి యడ్లపాటి వెంకట్రావు (102) కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన

Updated : 28 Feb 2022 12:08 IST

హైదరాబాద్‌: రాజకీయ కురువృద్ధుడు, తెదేపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి యడ్లపాటి వెంకట్రావు (102) కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన  హైదరాబాద్‌లోని కుమార్తె నివాసంలో సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఎమ్మెల్యే, ఎంపీ పదవులతో పాటు మంత్రిగానూ వెంకట్రావు పనిచేశారు. రైతు నాయకుడిగానూ ఆయన సేవలందించారు. సంగం డెయిరీకి యడ్లపాటి వెంకట్రావు వ్యవస్థాపక అధ్యక్షుడు.

యడ్లపాటి వెంకట్రావు 1919 డిసెంబర్‌ 16న గుంటూరు జిల్లా బోడపాడులో జన్మించారు. ప్రముఖ రైతు నాయకుడు ఎన్జీ రంగా ముఖ్య అనుచరుడిగా ఆయన ప్రాచుర్యం పొందారు. 1967,1972 ఎన్నికల్లో స్వతంత్ర పార్టీ తరఫున.. 1978 ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున  వేమూరు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1978-80 మధ్యకాలంలో  మర్రి చెన్నారెడ్డి మంత్రివర్గంలో వ్యవసాయ మంత్రిగా పనిచేశారు. అనంతరం 1983లో తెదేపా చేరారు. ఆ పార్టీ నుంచి రాజ్యసభ ఎంపీగా, పొలిట్‌బ్యూరో సభ్యుడిగా.. 1995లో గుంటూరు జడ్పీ ఛైర్మన్‌గా పనిచేశారు. 2004 నుంచి క్రియాశీల రాజకీయాలకు ఆయన దూరంగా ఉన్నారు.  యడ్లపాటి వెంకట్రావు మృతిపట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని