Published : 21 May 2022 14:36 IST

Andhra News: లండన్‌ వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి ఉందా?: యనమల

అమరావతి: అనుమతి ఇవ్వకపోయినా సీఎం జగన్‌ లండన్ వెళ్లడం కోర్టు ధిక్కరణ కిందకే వస్తుందని తెదేపా సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. లండన్ వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి ఉందా? లేక దావోస్‌కు వెళ్లేందుకు మాత్రమే అనుమతించిందా అని ప్రశ్నించారు. లండన్‌కు అనుమతిస్తే అధికార పర్యటనలో ఎందుకు చేర్చలేదని నిలదీశారు. షెడ్యూల్‌లో లేని లండన్‌లో ఎందుకు దిగాల్సి వచ్చిందని ప్రశ్నించారు. దండుకున్న సంపద దాచుకోడానికే లండన్ వెళ్లారనే అనుమానం ప్రజల్లో బలంగా ఉందని ఆరోపించారు. మూడేళ్ల తర్వాత దావోస్ వెళ్లడం రాష్ట్రం కోసమా? అక్రమార్జన తరలింపు కోసమా? అని యనమల మండిపడ్డారు. సొంత, రహస్య పనులకు ప్రజాధనం దుర్వినియోగం చేయడమేంటని ప్రశ్నించిన యనమల.. ఇలా కోర్టు అనుమతితో విదేశీ పర్యటనలకు వెళ్లే పరిస్థితి దేశంలో ఏ సీఎంకు లేదన్నారు. దావోస్‌కు అధికార యంత్రాగంతో కలసి వెళ్లకుండా ప్రత్యేక విమానానికి ఒక ఖర్చు, కమర్షియల్ ఫ్లైట్‌కు మరో ఖర్చు పెట్టడం వెనుక మర్మమేంటని ప్రశ్నించారు. అసలే ఆర్థిక సంక్షోభంలో ఉన్న రాష్ట్రానికి ఇది అదనపు భారమవుతుందని పేర్కొన్నారు.

Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని