TDP: కుట్ర పూరితంగానే తప్పుడు నివేదికలు: పయ్యావుల

కుట్రపూరితంగానే శరత్‌ అసోసియేషన్‌తో తప్పుడు నివేదికలు తెప్పించుకొని తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై కేసులు పెట్టారని ఆ పార్టీ అధికార ప్రతినిధి పయ్యావుల కేశవ్‌ ఆరోపించారు.

Published : 19 Sep 2023 19:12 IST

అమరావతి: కుట్రపూరితంగానే శరత్‌ అసోసియేషన్‌తో తప్పుడు నివేదికలు తెప్పించుకొని తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై కేసులు పెట్టారని ఆ పార్టీ అధికార ప్రతినిధి పయ్యావుల కేశవ్‌ ఆరోపించారు. చంద్రబాబును అరెస్టు చేసినందుకు ప్రభుత్వం ఇప్పటికే ఆత్మరక్షణలో పడిందన్నారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌కు  సంబంధించి 42 కేంద్రాలకు సామగ్రి సరఫరా జరిగిందని, వాటన్నింటిలోనూ భౌతిక విచారణ చేసి రిపోర్డు ఇవ్వాలని అన్నారు. ‘‘ 42 కేంద్రాల్లో ఉన్న ఎక్విప్‌మెంట్‌ చూపిస్తూ వీడియోలు చూపిస్తాం. ఏ ఎక్విప్‌మెంట్‌ అడిగితే ఆ ఎక్విప్‌మెంట్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్లలో కనిపిస్తుంది. సీమన్స్‌ కంపెనీ అద్భుత పని తీరు కనబరిచిందని నివేదికలు వచ్చాయి. ఫైబర్‌ గ్రిడ్‌లో ప్రతి విషయాన్ని ఐఏఎస్‌లతో కూడిన హైపవర్‌ కమిటీ నిర్ణయం తీసుకుంది. అందులోనూ ఎలాంటి అవినీతి జరగలేదు. ఐఏఎస్‌ అధికారులను విచారించకుండా చంద్రబాబుపై మాత్రమే ఎలా ఆరోపణలు చేస్తారు?’’ అని పయ్యావుల ప్రశ్నించారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు