AP News: ఆర్థిక అరాచకత్వంపై కేంద్రం ఇంత తీవ్రంగా ఎప్పుడూ స్పందించలేదు : పట్టాభి

రాష్ట్రంలో ఆర్థిక క్రమశిక్షణ లోపించడం వల్ల ఖజానా దివాలా తీసిందని తెదేపా అధికార ప్రతినిధి పట్టాభి ధ్వజమెత్తారు.

Published : 23 Jan 2022 13:51 IST

అమరావతి: రాష్ట్రంలో ఆర్థిక క్రమశిక్షణ లోపించడం వల్ల ఖజానా దివాలా తీసిందని తెదేపా అధికార ప్రతినిధి పట్టాభి ధ్వజమెత్తారు. గతంలో వివిధ బ్యాంకుల నుంచి డ్రా చేసిన సొమ్ములకు తక్షణమే లెక్కలు చూపాలని కేంద్ర ఆర్థిక శాఖ రాసిన లేఖ జగన్‌ సర్కారుకు చెంపపెట్టు అని తెలిపారు. రోడ్లు, వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల పేరుతో చేసిన దోపిడీ ఈ లేఖతో తేటతెల్లమవుతోందన్నారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కేంద్ర ఆర్థిక శాఖ లేఖ రాసిందని పట్టాభి చెప్పారు. ఆర్థిక అరాచకత్వంపై కేంద్రం ఇంత తీవ్రంగా ఎప్పుడూ స్పందించలేదని తెలిపారు. ఇందుకు ముఖ్యమంత్రి సిగ్గుతో తలదించుకోవాలని పట్టాభి అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని