Maharashtra: గవర్నర్.. రఫేల్ జెట్ కంటే వేగంగా ఉన్నారే..!
బలపరీక్ష ప్రకటనపై ఠాక్రే వర్గం విసుర్లు
ముంబయి: మహారాష్ట్ర(Maharashtra) రాజకీయాల్లో కొనసాగుతోన్న అనిశ్చితి చివరిదశకు చేరుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ(MVA) కూటమి మెజార్టీ నిరూపించుకోవాలని గవర్నర్ ఆదేశించారు. మరోపక్క ఈ ఆదేశాలను సవాలు చేస్తూ శివసేన పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ బలపరీక్షకు పిలుపునివ్వడం చట్టవిరుద్ధమని శివసేన నేత సంజయ్ రౌత్ వ్యాఖ్యలు చేశారు. రఫేల్ జెట్ కూడా ఇంత వేగంగా ఉండదంటూ గవర్నర్ చర్యను తప్పుపట్టారు.
‘గత రెండు సంవత్సరాలుగా మా దస్త్రాలు గవర్నర్ వద్ద పెండింగ్లో ఉన్నాయి. వాటిపై ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ ప్రస్తుత పరిణామాలపై ఆయన జెట్ వేగంతో దూసుకెళ్తున్నారు. రఫేల్ జెట్ కూడా ఇంత వేగంగా ఉండదు. భాజపా, గవర్నర్.. భారత రాజ్యాంగంతో ఆటలాడుకుంటున్నారు. గవర్నర్ ఆదేశాలు చట్టవిరుద్ధం. ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీం కోర్టు ఇంకా తీర్పు వెలువరించని తరుణంలో తాజా చర్య చట్టవిరుద్ధం’ అంటూ రౌత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార కూటమి మెజార్టీ కోల్పోయిందని తెలియజేస్తూ నిన్న భాజపా ప్రతినిధి బృందం గవర్నర్ను కలిసింది. ఆ తర్వాతే బలపరీక్ష ప్రకటన వెలువడింది.
మరోపక్క, ఏక్నాథ్ శిందే నాయకత్వంలో శివసేన అసమ్మతి ఎమ్మెల్యేలు అస్సాంలోని గువాహటి హోటల్లో ఉన్న సంగతి తెలిసిందే. గవర్నర్ బలపరీక్ష ఆదేశాల నేపథ్యంలో వారంతా ఈ రోజు మధ్యాహ్నం మహారాష్ట్ర పొరుగురాష్ట్రానికి చేరుకోనున్నారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Dwayne Bravo: పొట్టి క్రికెట్లో ‘600 వికెట్లు’ తీసిన ఒకే ఒక్కడు
-
General News
TS EAMCET: మరి కాసేపట్లో తెలంగాణ ఎంసెట్ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
Movies News
Pavan tej: కొణిదెల హీరో నిశ్చితార్థం.. ఫొటోలు వైరల్..
-
India News
Jammu and Kashmir: జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదులు దుశ్చర్య.. మరో వలసకూలీ దారుణ హత్య..!
-
Crime News
YS Viveka Murder Case: విచారణ సుప్రీం పర్యవేక్షణలో జరగాలి: వివేకా కుమార్తె పిటిషన్
-
India News
India Corona: 16 వేల కొత్త కేసులు.. 49 మరణాలు..!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Arjun Tendulkar: ముంబయిని వీడనున్న అర్జున్ తెందుల్కర్
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (12/08/2022)
- సారూ.. ఈ తిండి ఎలా తినగలం?.. నడిరోడ్డుపై ఏడ్చేసిన కానిస్టేబుల్
- Vizag Beach: వైజాగ్ ఆర్కే బీచ్లో నల్లగా మారిపోయిన ఇసుక..
- AP Govt: మరో బాదుడు
- Viral Video: పిల్లలకు తిండిపెట్టాలా? చంపుకోవాలా?.. ఓ తల్లి ఆవేదన!
- కొన్నిసార్లు నోరు విప్పకపోవడమే బెటర్.. ఎందుకంటే! : విజయ్ దేవరకొండ
- Social Look: యశ్, మహేశ్ ‘రాఖీ’ విషెస్.. ఈ హీరోయిన్ల సోదరులని చూశారా!
- Hyderabad News: నాన్నను బతికించుకొనేందుకు ఆస్తులమ్మి.. షేర్లలో పెట్టి ఆత్మహత్య
- Arun Vijay: వారి మధ్య ఐక్యత లేకపోవడం వల్లే కోలీవుడ్ నష్టపోతోంది: అరుణ్ విజయ్