Teegala krishna reddy: మీర్‌పేట్‌ను మంత్రి సబిత నాశనం చేస్తున్నారు: తీగల తీవ్ర ఆరోపణలు

తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డిపై జీహెచ్‌ఎంసీ మాజీ మేయర్‌, తెరాస నేత తీగల కృష్ణారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు...

Updated : 05 Jul 2022 13:18 IST

హైదరాబాద్: తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డిపై జీహెచ్‌ఎంసీ మాజీ మేయర్‌, తెరాస నేత తీగల కృష్ణారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. మీర్‌పేట్‌ను సబిత నాశనం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఆ ప్రాంతాన్ని నాశనం చేస్తుంటే చూస్తూ ఊరుకోనని హెచ్చరించారు. తమ ప్రాంతం కోసం అవసరమైతే ఆమరణ నిరాహారదీక్ష చేస్తానని చెప్పారు. సబిత కబ్జాలను ప్రోత్సహిస్తున్నారని.. చెరువులు, పాఠశాలల స్థలాలను వదలడం లేదని తీగల ఆరోపించారు. తమ పార్టీ నుంచి సబిత ఎమ్మెల్యేగా గెలవలేదన్నారు. అభివృద్ధిని ఆమె గాలికొదిలేశారని విమర్శించారు. మంత్రి సబిత వైఖరిపై సీఎం కేసీఆర్‌తో మాట్లాడతానని తీగల కృష్ణారెడ్డి చెప్పారు.

గత ఎన్నికల్లో రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో కాంగ్రెస్‌ తరఫున సబితాఇంద్రారెడ్డి, తెరాస నుంచి తీగల కృష్ణారెడ్డి పోటీ చేశారు. తీగలపై సబిత విజయం సాధించారు. అనంతరం ఆమె తెరాసలో చేరడం.. మంత్రి పదవి దక్కించుకోవడం జరిగిపోయాయి. అప్పటి నుంచి నియోజకవర్గంలో వీరి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ఈ క్రమంలో సబితా ఇంద్రారెడ్డి, తీగల కృష్ణారెడ్డి రెండు వర్గాలుగా విడిపోయారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని