Bandi Sanjay: 6 రోజులుగా ఆందోళన చేస్తున్నా.. కేసీఆర్‌కు పట్టదా?: బండిసంజయ్‌

బాసర ట్రిపుల్‌ ఐటీ విద్యార్థుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని తెలంగాణ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు.

Updated : 20 Jun 2022 12:42 IST

బాసర: బాసర ట్రిపుల్‌ ఐటీ విద్యార్థుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని తెలంగాణ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు ఆయన లేఖ రాశారు. ఆరు రోజులుగా విద్యార్థులు ఆందోళన చేస్తున్నా.. సీఎంకు పట్టదా?అని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల న్యాయమైన 12 డిమాండ్లను వెంటనే పరిష్కరించాలన్నారు. ‘‘జాతీయపార్టీ ఏర్పాటుకు మాత్రం సీఎంకు సమయం ఉంటుందా? విద్యార్థి సంఘాలతో ప్రభుత్వం సమావేశం ఏర్పాటు చేయాలి. మంత్రులు, అధికారులు, విద్యార్థులతో మైండ్‌ గేమ్‌ ఆడటం మానుకోవాలి’’ అని కేసీఆర్‌కు రాసిన లేఖలో బండి సంజయ్‌ పేర్కొన్నారు.

ఏడో రోజూ కొనసాగుతున్న ఆందోళన

మరోవైపు బాసర ట్రిపుల్‌ ఐటీలో విద్యార్థుల ఆందోళన ఏడో రోజూ కొనసాగుతోంది. తమ డిమాండ్ల సాధన కోసం ప్రధాన ద్వారం వద్ద విద్యార్థులు బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా ట్రిపుల్‌ఐటీ వద్ద పోలీసులు మూడంచెల బందోబస్తును ఏర్పాటు చేశారు. ఆదివారం అర్ధరాత్రి దాటాక విద్యార్థులతో ఆర్‌జీయూకేటీ డైరెక్టర్‌ సతీశ్ కుమార్, కలెక్టర్‌ ముష్రాఫ్‌ అలీ జరిపిన చర్చలు కొలిక్కిరాలేదు. మంత్రులు కేటీఆర్‌, సబితతో రాతపూర్వక హామీ ఇప్పించాలని విద్యార్థులు పట్టుబట్టడంతో చర్చలు ఎటూ తెగలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని