MLA Kavvampally: జులై 2న తెలంగాణ మంత్రివర్గ విస్తరణ!

రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జులై 2న ఉంటుందని కాంగ్రెస్‌ మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ తెలిపారు. ఈ మేరకు తనకు సమాచారం ఉందని చెప్పారు. ఆ రోజు మక్తల్‌ శాసనసభ్యుడు వాకిటి శ్రీహరి మంత్రిగా ప్రమాణం చేస్తారని వెల్లడించారు.

Published : 23 Jun 2024 05:32 IST

తనకు సమాచారముందన్న ఎమ్మెల్యే కవ్వంపల్లి 

హైదరాబాద్, న్యూస్‌టుడే: రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జులై 2న ఉంటుందని కాంగ్రెస్‌ మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ తెలిపారు. ఈ మేరకు తనకు సమాచారం ఉందని చెప్పారు. ఆ రోజు మక్తల్‌ శాసనసభ్యుడు వాకిటి శ్రీహరి మంత్రిగా ప్రమాణం చేస్తారని వెల్లడించారు. కరీంనగర్‌ జిల్లాకు చెందిన భారాస ఎమ్మెల్యే ఒకరు త్వరలో కాంగ్రెస్‌లో చేరబోతున్నారని చెప్పారు. ఎమ్మెల్యే శ్రీహరితో కలిసి కవ్వంపల్లి శనివారం అసెంబ్లీలోని సీఎల్పీ మీడియా సెంటర్‌లో, అనంతరం విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. రైతు రుణమాఫీ మీద అనవసర రాద్ధాంతం చేస్తున్న ప్రతిపక్షాలకు సీఎం రేవంత్‌రెడ్డి క్యాబినెట్‌ సమావేశం అనంతరం చేసిన వ్యాఖ్యలు చెంపపెట్టు లాంటివన్నారు. రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానన్న హరీశ్‌రావు.. రాజీనామా పత్రంతో సిద్ధంగా ఉండాలని సూచించారు. శ్రీహరి మాట్లాడుతూ రుణమాఫీ చేస్తామని ప్రకటించినందుకు సీఎం రేవంత్‌రెడ్డికి ఎమ్మెల్యేల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని