Updated : 25 May 2022 21:47 IST

Cm Kcr: బెంగళూరు వెళ్లనున్న సీఎం కేసీఆర్‌.. తాజా పరిణామాలపై దేవెగౌడతో చర్చ!

హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు బెంగళూరు వెళ్లనున్నారు. మాజీ ప్రధాని హెచ్.డీ. దేవెగౌడతో పాటు కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామితో కేసీఆర్ సమావేశం కానున్నారు. రేపు ఉదయం బేగంపేట విమానాశ్రయం నుంచి సీఎం ప్రత్యేక విమానంలో బెంగళూరు బయల్దేరివెళ్తారు. దేవెగౌడ నివాసంలో లంచ్ సమావేశంలో సీఎం కేసీఆర్ పాల్గొంటారు. దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిణామాలు, జాతీయ రాజకీయాలు, రాష్ట్రాల విషయంలో కేంద్ర ప్రభుత్వం అనురిస్తున్న విధానాలు సహా తాజా పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై దేవెగౌడ, కుమారస్వామితో చర్చించనున్నట్లు సమాచారం. దేశంలో ప్రబల మార్పు రావాల్సిన అవసరం ఉందంటున్న కేసీఆర్.. అందుకు సంబంధించిన అంశాలపై వారితో చర్చించే అవకాశాలున్నాయి. రానున్న రోజుల్లో అనుసరించాల్సిన కార్యాచరణ, ప్రాంతీయ పార్టీల పాత్ర, తదితర అంశాలపై కూడా చర్చించనున్నారు. త్వరలో జరగనున్న రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. కేసీఆర్ పర్యటన నేపథ్యంలో బెంగళూరులో అభిమానులు ఇప్పటికే ఫ్లైక్సీలు ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి భద్రతా విభాగం అధికారులు, సిబ్బంది ఇప్పటికే బెంగళూరు చేరుకొని ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. రేపు సాయంత్రం కేసీఆర్ తిరిగి హైదరాబాద్ రానున్నారు.

Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని