Telangana Budget: తెలంగాణలో మార్చి 7నుంచి శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు

తెలంగాణలో మార్చి 7వ తేదీ నుంచి శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర బడ్జెట్‌ సమావేశాల నిర్వహణ తేదీలను ఖారారు చేసేందుకు ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ప్రగతిభవన్‌లో ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు...

Published : 28 Feb 2022 17:28 IST

హైదరాబాద్: తెలంగాణలో మార్చి 7వ తేదీ నుంచి శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర బడ్జెట్‌ సమావేశాల నిర్వహణ తేదీలను ఖారారు చేసేందుకు ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ప్రగతిభవన్‌లో ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు, శాసనసభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌, అందుబాటులో ఉన్న ఇతర మంత్రులు, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఉన్నతాధికారులతో సీఎం సమావేశమయ్యారు. ఈ మేరకు బడ్జెట్‌ సమావేశాల తేదీలను సీఎం కేసీఆర్‌ ఖరారు చేశారు. మార్చి 6వ తేదీన ప్రగతి భవన్‌లో రాష్ట్ర మంత్రివర్గం సమావేశమై 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను ఆమోదం తెలుపనుంది. మార్చి 7న ప్రారంభమయ్యే బడ్జెట్‌ సమావేశాల్లో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెడతారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని