Telangana News: వరంగల్‌ సభ విజయవంతమవడం కేటీఆర్‌ జీర్ణించుకోలేకపోతున్నారు: కాంగ్రెస్‌

తెలంగాణ రాష్ట్రం గురించి కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్‌ గాంధీ అన్న మాటల్లో తప్పేముందని.. ఆయన అన్నీ నిజాలే మాట్లాడారని కాంగ్రెస్ నేతలు అన్నారు. రాహుల్ గాంధీ...

Published : 08 May 2022 02:08 IST

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రం గురించి కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్‌ గాంధీ అన్న మాటల్లో తప్పేముందని.. ఆయన అన్నీ నిజాలే మాట్లాడారని కాంగ్రెస్ నేతలు అన్నారు. రాహుల్ గాంధీ పర్యటనతో తెరాస నేతల్లో అసంతృప్తి నెలకొందని నేతలు ధ్వజమెత్తారు. పార్టీ నేతల కృషితో వరంగల్ సభ విజయవంతం కావడాన్ని మంత్రి కేటీఆర్ జీర్ణించుకోలేక పోతున్నారని విమర్శించారు. కేసీఆర్, కేటీఆర్, కవితకు సోనియా గాంధీ వల్లే పదవులు వచ్చాయనే విషయాన్ని మర్చిపోవద్దన్నారు. చీమలు పెట్టిన పుట్టలో పాములు దూరినట్లు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ఇస్తే.. తెరాస ఏలుతోందని మండిపడ్డారు.

‘‘ఈ 8 ఏళ్లలో సీఎం కేసీఆర్‌ ఒక్కసారైనా అఖిలపక్షాన్ని పిలిచారా? మంత్రులకు, ఎమ్మెల్యేలకు స్వేచ్ఛ లేకుండా చేశారు. కేసీఆర్‌ కుటుంబానికి ఇన్ని రూ.వేల కోట్లు ఎక్కడ నుంచి వచ్చాయి? రాహుల్‌ గాంధీ కుటుంబం గురించి మాట్లాడే అర్హత కేటీఆర్‌కు లేదు. తన స్థాయి ఏంటో తెలుసుకొని మాట్లాడాలి. తెలంగాణలో అవినీతి జరిగిందని ఆరోపణలు చేస్తున్న భాజపా.. ఎందుకు ఈడీ, సీబీఐ విచారణ జరిపించడం లేదు? కాంగ్రెస్‌తో పొత్తు కావాలని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ను సీఎం కేసీఆర్ అడిగింది వాస్తవం కాదా.. కేటీఆర్ సన్నిహితులు తరచూ గోవా ఎందుకు వెళ్తున్నారో చెప్పాలి. ఎందుకని మంత్రి కేటీఆర్‌ వైట్ ఛాలెంజ్ స్వీకరించలేదు? వచ్చే 30 రోజుల్లో వరంగల్ డిక్లరేషన్‌పై రాష్ట్రంలో చర్చ జరిగేలా కార్యకర్తలు చొరవ చూపాలి’’ అని కాంగ్రెస్‌ నేతలు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని