
Updated : 25 Jan 2022 16:37 IST
TS News: తెరాస నేతలు పోలీసులను స్వేచ్ఛగా పనిచేయనివ్వడం లేదు: సీఎల్పీ ఫిర్యాదు
హైదరాబాద్: తెలంగాణలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని సీఎల్పీ ఆరోపించింది. రాష్ట్రంలో ప్రజల ధన, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క మండిపడ్డారు. ఈ మేరకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. భట్టి విక్రమార్క నేతృత్వంలో ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, శ్రీధర్‌బాబు, సీతక్క తదితరులతో కూడిన బృందం గవర్నర్‌ను కలిసింది.
పోలీస్ వ్యవస్థ, శాంతిభద్రతలు, కొత్తగూడెం, నిజామాబాద్, మంథనిలో న్యాయవాదుల హత్య తదితర అంశాలను నేతలు తమిళిసై దృష్టికి తీసుకెళ్లారు. అధికార తెరాస నేతలు పోలీసులను స్వేచ్ఛగా పనిచేయనివ్వడం లేదని సీఎల్పీ నేతలు గవర్నర్ ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో పోలీసుల నుంచి రక్షణ ఉంటుందనే భావనను ప్రజలు కోల్పోయారని.. పోలీస్ శాఖపై సమీక్ష నిర్వహించిన తగిన ఆదేశాలివ్వాలని గవర్నర్‌ను కోరారు.
Tags :