Published : 08 Jan 2022 01:33 IST

Ts News: భాజపా ఎంపీ అర్వింద్‌, బొడిగె శోభకు హైకోర్టులో ఊరట

హైదరాబాద్‌: చొప్పదండి మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభను వెంటనే విడుదల చేయాలని హైకోర్టు ఆదేశించింది. రూ.25వేల పూచీకత్తుతో బొడిగె శోభను విడుదల చేయాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేపట్టిన జన జాగరణ దీక్షకు సంబంధించిన కేసులో కరీంనగర్‌ పోలీసులు బొడిగె శోభను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా.. మేజిస్ట్రేట్‌ 14 రోజులు జ్యుడిషియల్‌ రిమాండ్‌ విధించింది. దీంతో తన రిమాండ్‌ను రద్దు చేయాలని కోరుతూ శోభ వేసిన అత్యవసర పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. శోభ రిమాండ్‌పై స్టే విధించిన ధర్మాసనం.. ఆమె అరెస్టుకు సంబంధించిన పూర్తి వివరాలు సమర్పించాలని కరీంనగర్ పోలీసులను ఆదేశిస్తూ కేసు విచారణను ఫిబ్రవరి 7కు వాయిదా వేసింది.

అభ్యంతరకర పోస్టులు పెట్టొద్దు: ఎంపీ అర్వింద్‌కు ఆదేశం

సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర పోస్టులు పెట్టొద్దని ఎంపీ ధర్మపురి అర్వింద్‌ను హైకోర్టు ఆదేశించింది. సీఎం కేసీఆర్‌ను కించపరిచేలా పోస్టులు పెట్టారని ఎంపీ అర్వింద్‌పై బంజారాహిల్స్‌లో కేసు నమోదైంది. బంరాహిల్స్‌లో నమోదైన కేసును కొట్టివేయాలన్న అర్వింద్ పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ మేరకు అర్వింద్‌పై కఠిన చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించిన న్యాయస్థానం పూర్తి వివరాలు సమర్పించాలని పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 7కి వాయిదా వేసింది.

Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని