Harish Rao: తక్షణమే 50లక్షల వ్యాక్సిన్‌లు పంపండి: కేంద్రానికి హరీశ్‌ లేఖ

తెలంగాణలో వ్యాక్సిన్ కొరత ఉందని కేంద్రమంత్రి మన్‌సుఖ్‌ మాండవీయకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌ రావు లేఖ రాశారు.

Published : 09 Aug 2022 14:14 IST

హైదరాబాద్: తెలంగాణలో వ్యాక్సిన్ల కొరత ఉందని.. వెంటనే పంపాలని కేంద్రాన్ని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు కోరారు. ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయకు ఆయన లేఖ రాశారు. రోజుకు 1.5లక్షల డోసులు మాత్రమే పంపిణీ చేస్తున్నామని.. డిమాండ్‌కు సరిపడా వ్యాక్సిన్లు రాష్ట్రానికి సరఫరా కావడం లేదన్నారు. తక్షణమే 50లక్షల కొవిషీల్డ్‌ వ్యాక్సిన్ డోసులను తెలంగాణకు పంపాలని కేంద్రమంత్రిని కోరారు. వ్యాక్సినేషన్‌లో దేశంలోనే తెలంగాణ ముందంజలో ఉందని కేంద్ర మంత్రికి రాసిన లేఖలో హరీశ్‌రావు పేర్కొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని