Updated : 15 Mar 2022 09:55 IST

KTR: కర్ణాటకకు ఇచ్చి.. తెలంగాణకు ఇవ్వకపోవడం వివక్ష కాదా?: కేటీఆర్‌

హైదరాబాద్‌: అర్హతలన్నీ ఉన్నా కాళేశ్వరానికి జాతీయ హోదా ఎందుకు ఇవ్వరని కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ నిలదీశారు. జాతీయ హోదా ఇవ్వకపోవడం వివక్ష కాదా? అని ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. ‘‘కర్ణాటకలోని ఎగువ భద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చారు. ప్రపంచంలోనే అతి పెద్ద లిఫ్ట్‌ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయిన కాళేశ్వరానికి అన్నీ అర్హతలున్నా జాతీయ హోదా ఎందుకు ఇవ్వరు? రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే భాజపా నేతలు చోద్యం చూస్తున్నారు’’ అని కేటీఆర్‌ ట్వీట్‌లో పేర్కొన్నారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts