Telangana News: కేటీఆర్‌ వ్యాఖ్యలపై ఉలికిపాటు ఎందుకు?: తలసాని

పక్క రాష్ట్రంలో కరెంట్‌ లేదంటూ మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యలతో మొదలైన  వివాదం ఇంకా కొనసాగుతోంది. హైదరాబాద్‌లోనే కరెంట్‌ లేదంటూ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలపై మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌

Updated : 30 Apr 2022 14:11 IST

హైదరాబాద్‌: పక్క రాష్ట్రంలో కరెంట్‌ లేదంటూ మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యలతో మొదలైన వివాదం ఇంకా కొనసాగుతోంది. హైదరాబాద్‌లోనే కరెంట్‌ లేదంటూ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలపై మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ స్పందించారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. కేటీఆర్‌ వ్యాఖ్యలపై ఏపీ నేతలు ఎందుకు ఉలికిపాటుకు గురవుతున్నారని ప్రశ్నించారు.

హైదరాబాద్‌లో కరెంట్‌ లేదనడంలో అర్థం లేదని మండిపడ్డారు. కరెంట్‌ లేకుంటే ఇక్కడెందుకు శుభకార్యాలు చేస్తున్నారని నిలదీశారు. ఏపీ నేతలు తొందరపాటు వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. కోతలు లేని విద్యుత్, మౌలిక వసతుల కల్పన వల్లే నగరానికి పెట్టుబడులు పోటెత్తుతున్నాయని తలసాని వివరించారు. 

పక్క రాష్ట్రంలో కరెంటు, నీళ్లు లేవని.. రోడ్లన్నీ ధ్వంసమయ్యాయని కేటీఆర్‌ నిన్న చేసిన వ్యాఖ్యలు రాజకీయ వేడి పుట్టించిన విషయం తెలిసిందే. ఏపీ, తెలంగాణ ప్రజాప్రతినిధులు ఈ అంశంపై పోటాపోటీగా విమర్శలు గుప్పించుకున్నారు. మరోవైపు తాను చేసిన వ్యాఖ్యల వెనుక దురుద్దేశం లేదని, జగన్‌ పాలనలో ఏపీ మరింత అభివృద్ధి సాధించాలని కేటీఆర్‌ అర్ధరాత్రి సమయంలో ట్వీట్‌ చేసిన విషయం తెలిసిందే.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని