Telangana News: ప్రధాని పర్యటన.. భాజపా, తెరాస ట్వీట్ల వార్‌!

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్‌ పర్యటన నేపథ్యంలో తెరాస, భాజపా మధ్య ట్విటర్‌ వేదికగా వార్‌ చోటుచేసుకుంది. ప్రధానికి సీఎం కేసీఆర్‌ స్వాగతం పలకకపోవడంపై....

Published : 06 Feb 2022 02:03 IST

హైదరాబాద్‌: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్‌ పర్యటన నేపథ్యంలో తెరాస, భాజపా మధ్య ట్విటర్‌ వేదికగా వార్‌ చోటుచేసుకుంది. ప్రధానికి సీఎం కేసీఆర్‌ స్వాగతం పలకకపోవడంపై ఇరుపార్టీల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు కొనసాగుతున్నాయి. జ్వరం వల్ల కేసీఆర్‌ ప్రధాని పర్యటనకు హాజరుకాలేదని తెరాస పేర్కొనగా.. కేసీఆర్‌ పదేపదే రాజ్యాంగాన్ని అవమానపరుస్తున్నారంటూ భాజపా ట్వీట్‌ చేసింది. కేసీఆర్‌ ప్రొటోకాల్‌ పాటించకపోవడం సిగ్గుచేటంది. దీనిపై తెరాస దీటుగా స్పందించింది. వ్యక్తిగత పర్యటనలో ప్రధానికి సీఎం స్వాగతం పలకాల్సిన అవసరం లేదంటూ ట్వీట్‌ చేసింది. ప్రజల్ని తప్పుదోవ పట్టించేలా చౌకబారు వ్యూహాన్ని భాజపా ఆపాలని సూచిందింది.

మరోవైపు, తెలంగాణ రాష్ట్ర మంత్రులు, తెరాస నేతలు వరుసగా ట్వీట్లతో హోరెత్తించారు. ‘ఈక్వాలిటీ ఫర్‌ తెలంగాణ’ అంటూ హ్యాష్‌ట్యాగ్‌తో దాదాపు 20వేలకుపైగా ట్వీట్లు చేశారు. దీంతో ‘ఈక్వాలిటీ ఫర్‌ తెలంగాణ’ హ్యాష్‌ ట్యాగ్‌ ట్రెండింగ్‌లోకి దూసుకొచ్చింది. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి అన్యాయం, పునర్విభజన హామీలు, ప్రాజెక్టులను మంత్రులు, నేతలు ప్రస్తావించారు. వీరిలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, నిరంజన్‌రెడ్డి, సత్యవతి రాథోడ్, మహమూద్‌ అలీ,  శ్రీనివాస్‌ గౌడ్‌, సబితా ఇంద్రారెడ్డి తదితరులు ట్వీట్లు చేశారు. ట్యాంక్‌బండ్‌పై ‘ఈక్వాలిటీ ఫర్‌ తెలంగాణ’ ఫ్లెక్సీని తెరాస కార్యకర్తలు ప్రదర్శించారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని