Telangana News: రాజకీయ వ్యూహకర్త సునీల్‌ కార్యాలయంలో పోలీసుల సోదాలు

సీఎం కేసీఆర్‌, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో రాజకీయ వ్యూహకర్త సునీల్‌ కనుగోలు కార్యాలయంలో మంగళవారం సాయంత్రం పోలీసులు సోదాలు నిర్వహించారు. కంప్యూటర్‌, ల్యాప్‌టాప్‌లు సీజ్‌ చేశారు.

Updated : 13 Dec 2022 22:36 IST

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ రాజకీయ వ్యూహకర్త సునీల్‌ కనుగోలు కార్యాలయంపై పోలీసులు దాడి చేసి సీజ్‌ చేశారు. మాదాపూర్‌ ఇనార్బిట్‌మాల్‌ సమీపంలోని ఎస్‌కే కార్యాలయంలో సైబర్‌ పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ సాయంత్రం కార్యాలయంలోకి వెళ్లిన పోలీసులు వెంటనే అక్కడ పనిచేస్తున్న సిబ్బంది వద్ద నుంచి సెల్‌ఫోన్‌లు తీసుకున్నారు. ఆ తరువాత కార్యాలయం అంతా తనిఖీలు నిర్వహించి కంప్యూటర్‌, ల్యాప్‌టాప్‌లు సీజ్‌ చేశారు. సీఎం కేసీఆర్‌, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో పోలీసులు సోదాలు నిర్వహించినట్టు తెలుస్తోంది. ఈ విషయం తెలియగానే కాంగ్రెస్‌ నేతలు షబ్బీర్‌ అలీ, మల్లు రవి, అనిల్‌ కుమార్‌ యాదవ్‌ ఇతర నేతలు అక్కడికి చేరుకున్నారు. సునీల్‌ కనుగోలు కార్యాలయాన్ని కుట్రపూరితంగా సీజ్‌ చేశారని, ఎఫ్ఆర్‌ఐ లేకుండా ఏలా సీజ్‌ చేస్తారని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో  అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. సునీల్‌ కార్యాలయంపై పోలీసుల దాడి, సీజ్‌ చేయడాన్ని ఖండిస్తూ కాంగ్రెస్‌ నేతలు ధర్నాకు దిగారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు