Chandrababu: వివేకా హత్య కేసులో జగన్ పాత్ర జగమెరిగిన సత్యం: చంద్రబాబు
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీఎం జగన్ పాత్ర జగమెరిగిన సత్యమని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు.

రాజమహేంద్రవరం: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీఎం జగన్ పాత్ర జగమెరిగిన సత్యమని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. సీఎం జగన్ పేరును సీబీఐ అదనపు అఫిడవిట్‌లో ప్రస్తావించడంపై రాజమహేంద్రవరంలో జరిగిన తెదేపా పొలిట్ బ్యూరో సమావేశంలో చర్చించారు. వివేకా హత్యకేసును ఎన్ని మలుపులైనా తిప్పుతారని వ్యాఖ్యానించారు. అంతఃపురం కుట్ర భయటపడుతుందనే ఇంతకాలం అవినాష్ రెడ్డి అరెస్టును అడ్డుకుంటున్నారని పేర్కొన్నారు.
అందుకే ఇంతకాలం సీబీఐకి సహకరించకుండా పోలీసుల్ని అడ్డు పెట్టుకున్నారని ఆరోపించారు. అవినాష్ అరెస్టు కాకుండా ఉండేందుకే మరో డేరాబాబా ఎపిసోడ్‌కు తెర తీశారని చంద్రబాబు అన్నారు. మహానాడు ఏర్పాట్లుు, ప్రభుత్వ అడ్డంకులు, తీర్మానాలు వంటి అంశాలపై పొలిట్ బ్యూరోలో చర్చించారు. మహానాడులో రెండ్రోజుల పాటు జరిగే కార్యక్రమాలపై పొలిట్ బ్యూరో సభ్యులకు రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వివరించారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Ashwini Vaishnaw: ఆ నంబర్ల నుంచి కాల్స్ వస్తే లిఫ్ట్ చేయొద్దు: టెలికాం మంత్రి
-
World News
Restaurant: ఎక్కువ ఆహారాన్ని ఆర్డర్ చేస్తే ఇలా అవమానిస్తారా..!
-
Sports News
CSK-Rayudu: మా ఇద్దర్నీ ముందే పిలిచాడు.. ధోనీ అలా భావించాడేమో: రాయుడు
-
Movies News
Vishwak Sen: అందుకే పేరు మార్చుకున్నా: విశ్వక్ సేన్
-
World News
Ukraine: జెలెన్స్కీ ఇంటి ఎదుట ‘నాటు-నాటు’ పాటకు దుమ్ములేపిన ఉక్రెయిన్ సైనికులు
-
India News
Train Accident: ‘కోరమాండల్’ ఎక్స్ప్రెస్ ప్రమాదం.. ఉలిక్కి పడిన 4 రాష్ట్రాలు