Bhatti vikramarka: సీఎం సమావేశానికి హాజరవుతున్నాను: భట్టి

రాష్ట్రంలోని నాలుగు మండలాల్లో దళిత బంధు పైలట్‌ ప్రాజెక్టు అమలుపై మరికాసేపట్లో సన్నాహక సమావేశం జరగనుంది.

Published : 13 Sep 2021 14:26 IST

హైదరాబాద్‌: రాష్ట్రంలోని నాలుగు మండలాల్లో దళిత బంధు పైలట్‌ ప్రాజెక్టు అమలుపై మరికాసేపట్లో సన్నాహక సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి తాను హాజరుకానున్నట్లు సీఎల్సీ నేత భట్టి విక్రమార్క తెలిపారు. మధిర శాసనసభ నియోజకవర్గంలోని చింతకాని మండలం కూడా ఇందులో ఉందని.. దీంతో స్థానిక శాసనసభ్యుడనైన తనను ఆహ్వానించారని భట్టి విక్రమార్క తెలిపారు. ఈ సమావేశంలో పాల్గొని.. కాంగ్రెస్‌ తరఫున డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచుతానని వెల్లడించారు.

ఈ ఉదయం నుంచి ఇప్పటివరకు పార్టీకి చెందిన నాయకులతో అన్ని విషయాలను చర్చించినట్లు భట్టి విక్రమార్క తెలిపారు. దళితబంధు సీఎం సమీక్ష సమావేశంలో ఏయే అంశాలను ప్రస్తావించాలన్న దానిపై నాయకుల నుంచి సలహాలు తీసుకున్నామని వివరించారు. భట్టి విక్రమార్క నివాసంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక భేటీలో ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, పొదెం వీరయ్య, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాస్కీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి ఇవాళ నిర్వహించనున్న దళితబంధు సమావేశంలో పాల్గొని లేవనెత్తాల్సిన అంశాలపై చర్చించారు. మధిర, అచ్చంపేట, తుంగతుర్తి, జుక్కల్‌ నియోజకవర్గాల్లో దళితబంధు పథకం అమలు కార్యాచరణపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో ఈ సమావేశం జరగనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని