రామగుండం ఫ్యాక్టరీ సమస్యను పరిష్కరించేందుకే వచ్చా: భగవంత్ కుబ

కేంద్ర కేబినెట్‌లో అత్యంత విద్యావంతులకు ప్రధాని నరేంద్రమోదీ చోటు కల్పించారని కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ సహాయ మంత్రి  భగవంత్ కుబ తెలిపారు. హైదరాబాద్‌లోని..

Published : 09 Aug 2021 01:03 IST

హైదరాబాద్‌: కేంద్ర కేబినెట్‌లో అత్యంత విద్యావంతులకు ప్రధాని నరేంద్రమోదీ చోటు కల్పించారని కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ సహాయ మంత్రి  భగవంత్ కుబ తెలిపారు. హైదరాబాద్‌లోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇన్నేళ్ల స్వతంత్ర భారతదేశంలో ఇంతటి సానుకూల వాతావరణాన్ని తీసుకొచ్చిన నేత మరొకరు లేరన్నారు. దేశ అభ్యున్నతికి సంబంధించి ప్రధాని మోదీ అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారని కొనియాడారు. రైతులకు మేలు చేసేందుకు ప్రధాని అనేక నిర్ణయాలు తీసుకున్నారన్నారు. వ్యవసాయంలో లాభాలు పెంచేందుకు తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని వెల్లడించారు.

‘‘తెలంగాణలో రామగుండం ఎరువుల కర్మాగారం మూత పడింది. దీంతో రాష్ట్రం, దేశానికి ఎలాంటి లాభం జరగదు. రైతులకు ఎరువుల ఇబ్బందులు.. స్థానికులు ఉపాధి కోల్పోయారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ సమస్యలు పరిష్కరించేందుకే తెలంగాణలో పర్యటిస్తున్నాను. ఏడేళ్ళ పాలనలో మోదీ సర్కారు ఏ ప్రాంతానికి ఎరువుల కొరత రానివ్వలేదు. ఏ రాష్ట్రానికి ఎన్ని ఎరువులను కేటాయించారో పూర్తి వివరాలు కేంద్రం వద్ద ఉన్నాయి. ఎప్పటికప్పుడు రాష్ట్రాల వ్యవసాయ శాఖ మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం పూర్తి పారదర్శకంగా పనిచేస్తోంది. ఏప్రిల్‌లో ఏ రాష్ట్రానికి ఎంత ఇచ్చామనే లెక్కలన్నీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచాం. ప్రస్తుతం తెలంగాణలో 3.80 మెట్రిక్ టన్నుల యూరియా, 45వేల మెట్రిక్ టన్నుల డీఏపీ, ఎన్‌పీకే 3.29 లక్షల మెట్రిక్ టన్నులు, ఎంవోపీ 55,600 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉన్నాయి’’ అని భగవంత్‌ కుబ వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని