Shiv Sena: ‘వరుణ్‌ రక్తం మరిగింది.. అందుకే స్పందించారు’

రైతు ఉద్యమానికి మద్దతుగా నిలవడమే కాకుండా లఖింపుర్ ఖేరి ఘటనను ఖండించిన భాజపా ఎంపీ వరుణ్‌ గాంధీని శివసేన పార్టీ పత్రిక సామ్నా ప్రశంసించింది. ఆయన్ను అభినందిస్తూ రైతు సంఘాలు తీర్మానాన్ని ఆమోదించాలని సూచన చేసింది. 

Published : 12 Oct 2021 01:27 IST

సామ్నాలో అభిప్రాయపడిన శివసేన

ముంబయి: రైతు ఉద్యమానికి మద్దతుగా నిలవడమే కాకుండా లఖింపుర్ ఖేరి ఘటనను ఖండించిన భాజపా ఎంపీ వరుణ్‌ గాంధీని శివసేన పార్టీ పత్రిక సామ్నా ప్రశంసించింది. ఆయన్ను అభినందిస్తూ రైతు సంఘాలు తీర్మానాన్ని ప్రతిపాదించాలని సూచన చేసింది. 

‘కొన్ని వర్గాల మధ్య శత్రుత్వాన్ని వ్యాప్తి చేయడానికి చేసే ప్రయత్నాలను ఈ దేశం భరించదు. వరుణ్ గాంధీ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ మనుమడు. సంజయ్ గాంధీ తనయుడు. లఖింపుర్ ఘటన చూసిన తర్వాత వరుణ్ రక్తం మరిగింది. అందుకే తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తదుపరి పరిణామాల గురించి ఆలోచించకుండా ఆయన ధైర్యాన్ని ప్రదర్శించారు. రైతుల హత్యలను ఖండించారు. అందుకే ఆయన్ను అభినందిస్తూ రైతు సంఘాలు తీర్మానాన్ని ఆమోదించాలి’ అని సామ్నా పత్రికలో శివసేన అభిప్రాయపడింది. అలాగే తమ భావాలను బహిరంగంగా వ్యక్తం చేయలేని వారికోసమే మహారాష్ట్ర అధికార కూటమి బంద్‌కు పిలుపునిచ్చినట్లు వెల్లడించింది. 

లఖింపుర్ ఖేరి ఘటనకు సంబంధించి కొద్దిరోజుల క్రితం వరుణ్ గాంధీ స్పష్టమైన వీడియోను విడుదల చేసిన సంగతి తెలిసిందే. హత్యల ద్వారా నిరసనకారుల నోరు మూయించలేమని, రైతుల రక్తానికి జవాబుదారీ అవసరమని ట్వీట్ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని