Vizag Steel Plant: ‘ఉక్కు’ ప్రైవేటీకరణను నిరసిస్తూ అఖిలపక్షాల పాదయాత్ర

స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ విశాఖలోని గాజువాక కాకతీయ గేట్‌ నుంచి పాత గాజువాక వరకు అఖిలపక్షాలు పాదయాత్ర నిర్వహించాయి.

Updated : 12 Sep 2021 14:10 IST

విశాఖపట్నం: స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని నిరసిస్తూ విశాఖలోని గాజువాక కాకతీయ గేట్‌ నుంచి పాత గాజువాక వరకు అఖిలపక్షాలు పాదయాత్ర నిర్వహించాయి. గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పాదయాత్రను మంత్రి అవంతి శ్రీనివాస్‌ ప్రారంభించారు. పాదయాత్ర ప్రారంభం సందర్భంగా స్థానికంగా ఉన్న అంబేడ్కర్‌ విగ్రహానికి మంత్రి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ పాదయాత్రలో విశాఖ ఉక్కు కర్మాగారం కార్మికులు, వివిధ సంఘాల నేతలు పాల్గొన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలంటూ నేతలు, కార్మికులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని