Huzurabad By Election: ఉపఎన్నికకు అన్ని ఏర్పాట్లు పూర్తి: సీఈవో శశాంక్‌ గోయల్‌

హుజూరాబాద్‌ ఉప ఎన్నికకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్‌ గోయల్‌ తెలిపారు. రేపు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు

Updated : 29 Oct 2021 18:25 IST

హైదరాబాద్‌: హుజూరాబాద్‌ ఉప ఎన్నికకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్‌ గోయల్‌ తెలిపారు. రేపు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుందని చెప్పారు. పోలింగ్‌ కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించినట్లు పేర్కొన్నారు. దివ్యాంగుల కోసం వీల్‌ఛైర్స్‌ ఏర్పాటు చేశామన్నారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నిక కోసం 32 మంది సూక్ష్మ పరిశీలకులు, ఈవీఎంల పరిశీలనకు అందుబాటులో ఆరుగురు ఇంజినీర్లు, భద్రత కోసం 20 కంపెనీల కేంద్ర బలగాలను మోహరించినట్లు వెల్లడించారు. ఓటర్లు ఓటు వేసే సమయంలో మాస్క్‌ ధరించి, భౌతిక దూరాన్ని పాటించాలన్నారు. రాజకీయ పార్టీల నుంచి అనేక ఫిర్యాదులు వచ్చాయని.. వాటిలో కొన్ని ఫిర్యాదులపై చర్యలు తీసుకున్నామన్నారు. ఇప్పటివరకు రూ.3.50 కోట్లు స్వాధీనం చేసుకున్నట్టు వివరించారు. ఓటర్లను ప్రలోభపెట్టే పనులు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని.. డబ్బుల పంపిణీ ఆరోపణలపై ఎప్పటికప్పుడు విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. తప్పుడు వార్తలు వ్యాప్తి చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 2018 ఎన్నికల్లో హుజూరాబాద్‌లో 84.5 శాతం ఓటింగ్‌ నమోదైందని.. ఈసారి ఓటింగ్‌ శాతం పెరగాలని కోరుకుంటున్నట్లు సీఈఓ శశాంక్‌ గోయల్‌ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని