Dalit bandhu: హుజూరాబాద్‌తో పాటు మరో 4 మండలాల్లో దళితబంధు

రాష్ట్రంలోని మరో నాలుగు మండలాల్లో దళితబంధు పథకం పైలట్‌ ప్రాజెక్టుగా అమలు చేయడం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ సోమవారం సన్నాహక సమావేశం నిర్వహించనున్నారు

Published : 11 Sep 2021 02:24 IST

హైదరాబాద్‌: రాష్ట్రంలోని మరో నాలుగు మండలాల్లో దళితబంధు పథకం పైలట్‌ ప్రాజెక్టుగా అమలు చేయడం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ సోమవారం సన్నాహక సమావేశం నిర్వహించనున్నారు. హుజూరాబాద్‌తోపాటు మధిర నియోజకవర్గంలోని చింతకాని, తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి, అచ్చంపేట-కల్వకుర్తి నియోజకవర్గాల్లోని చారగొండ, జుక్కల్‌ నియోజకవర్గంలోని నిజాంసాగర్‌ మండలాల్లో అమలు చేస్తామని సీఎం ఇటీవల ప్రకటించారు. ఈ నాలుగు మండలాల్లో దళితబంధు అమలుకు చేపట్టాల్సిన కార్యాచరణ కోసం హైదరాబాద్‌ ప్రగతి భవన్‌లో సన్నాహక సమావేశం నిర్వహించనున్నట్లు సీఎం కార్యాలయం తెలిపింది.  ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌ నగర్‌, నిజామాబాద్‌ జిల్లాల మంత్రులు, జెడ్పీ ఛైర్మన్లు, కలెక్టర్లు, మధిర, తుంగతుర్తి, అచ్చంపేట, కల్వకుర్తి, జుక్కల్‌ నియోజవర్గాల ఎమ్మెల్యేలు ఈ సమావేశంలో పాల్గొంటారు. మంత్రి కొప్పుల ఈశ్వర్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎంఓ కార్యదర్శి రాహుల్‌ బొజ్జా తదితరులు సమావేశంలో పాల్గొననున్నారు. దళితబంధు పథకం తీరుతెన్నులను వివరించేందుకు క్షేత్రస్థాయి అనుభవం కలిగిన కరీంనగర్‌ జిల్లా కలెక్టర్‌ ప్రత్యేక ఆహ్వానితులుగా సన్నాహక సమావేశంలో పాల్గొంటారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని