Ap News: మమ్మల్ని అరెస్టు చేయాల్సిన అవసరం పోలీసులకేంటి?:అమర్‌నాథ్‌రెడ్డి

ఎన్నికలు సజావుగా నిర్వహించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని మాజీ మంత్రి, తెదేపా నేత అమర్‌నాథ్‌రెడ్డి అన్నారు. మంగళవారం రాత్రి చిత్తూరు జిల్లా కుప్పంలో అమర్‌నాథ్‌రెడ్డిని

Published : 11 Nov 2021 01:07 IST

కుప్పం: ఎన్నికలు సజావుగా నిర్వహించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని మాజీ మంత్రి, తెదేపా నేత అమర్‌నాథ్‌రెడ్డి అన్నారు. మంగళవారం రాత్రి చిత్తూరు జిల్లా కుప్పంలో అమర్‌నాథ్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకొని పలమనేరులోని స్వగృహంలో వదిలిపెట్టిన విషయం తెలిసిందే. ఇవాళ కుప్పం తెదేపా కార్యాలయానికి వచ్చిన అమర్‌నాథ్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘మేం చలో కుప్పంకు పిలుపునిస్తే ఎన్నికలు జరుగుతాయా? మేం మాత్రమే ఉంటాం. తెదేపా నాయకులను అరెస్టు చేస్తామంటే కుదరదు. వైకాపా నాయకులు కుప్పంలో తిరుగుతున్నారు. స్థానికులైన మేం ఇక్కడ తిరిగితే తప్పేంటి?మమ్మల్ని అరెస్టు చేయాల్సిన అవసరం పోలీసులకేంటి?’’ అని అమర్‌నాథ్‌రెడ్డి ప్రశ్నించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని