Ap News: వరదలను చంద్రబాబు రాజకీయం చేస్తున్నారు: అంబటి

కడప జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు మట్టికట్ట తెగడంపై కేంద్ర జలవనరులశాఖ మంత్రి షెకావత్‌ చెప్పింది వాస్తవం కాదని వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు ..

Updated : 05 Dec 2021 19:47 IST

అమరావతి: కడప జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు మట్టికట్ట తెగడంపై కేంద్ర జల వనరులశాఖ మంత్రి షెకావత్‌ చెప్పింది వాస్తవం కాదని వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. చంద్రబాబు వాయిస్‌ను పార్లమెంట్‌లో వినిపించే ప్రయత్నం చేశారని విమర్శించారు. కేంద్ర బృందం రాష్ట్రంలో పర్యటించి ఏం చెప్పిందో షెకావత్‌ తెలుసుకోవాలని సూచించారు. అన్నమయ్య డ్యాం తెగడంపై న్యాయ విచారణ చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. అన్నమయ్య డ్యాం తెగడం మానవ తప్పిదం కానేకాదని, అత్యధిక వర్షాలు పడటం వల్లే డ్యాం తెగిందన్నారు. ఏది జరిగినా.. నిజాలు తెలుసుకుని మాట్లాడాల్సిన బాధ్యత కేంద్ర మంత్రికి, రాష్ట్రంలో ప్రతిపక్షానికి ఉంటుందన్నారు. మానవ తప్పిదంగా చిత్రీకరించి ప్రభుత్వంపై బురదజల్లాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారన్నారు. సీఎం జగన్‌ నాయకత్వంలో అధికారులు పనితీరు ప్రశంసనీయమని కేంద్ర బృందం ప్రసంశించిందన్నారు. వరదలను చంద్రబాబు రాజకీయం చేస్తూ వికృత క్రీడ ఆడుతున్నారని మండిపడ్డారు. అధికారంలోకి వస్తే గృహ వినియోగదారుల రుణాలన్నింటినీ మాఫీ చేస్తామని చంద్రబాబు అంటున్నారు... అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు రద్దు చేయలేదో చెప్పాలని అంబటి డిమాండ్‌ చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని