AP Assembly: ఈనెల 26 వరకు ఏపీ శాసనసభ సమావేశాలు

ఏపీ శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి.

Updated : 18 Nov 2021 11:16 IST

అమరావతి: ఏపీ శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభమైన తర్వాత ఇటీవల మృతిచెందిన మాజీ ఎమ్మెల్యేలకు శాసనసభ సంతాపం తెలిపింది. దీనికి సంబంధించిన సంతాప తీర్మానాలను స్పీకర్‌ తమ్మినేని సీతారాం సభలో చదివి వినిపించారు. ఆ తర్వాత సభ్యులు సభలో కొద్దిసేపు మౌనం పాటించి సంతాపం తెలిపారు. అనంతరం ఇటీవల బద్వేలు ఉప ఎన్నికలో విజయం సాధించిన దాసరి సుధ ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు. స్పీకర్‌ తమ్మినేని సీతారాం ఆమెతో ప్రమాణం చేయించారు.

అనంతరం స్పీకర్‌ అధ్యక్షతన బీఏసీ సమావేశమైంది. సీఎం జగన్‌తో పాటు మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, అనిల్‌కుమార్‌ యాదవ్‌, చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌రెడ్డి పాల్గొన్నారు. తెదేపా తరఫున ఆ పార్టీ శాసనసభాపక్ష ఉప నేత అచ్చెన్నాయుడు హాజరయ్యారు.  ఈనెల 26 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఏసీలో నిర్ణయించారు. తొలుత ఈ ఒక్కరోజే సభ నిర్వహించాలని భావించినప్పటికీ పలు బిల్లులకు ఆమోదం తెలపాల్సిన దృష్ట్యా సమావేశాలను 26 వరకు నిర్వహించాలని నిర్ణయించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని