AP News: దాడులను ఖండిస్తున్నాం.. డీజీపీలో మార్పు రావాలి: సోము వీర్రాజు

ఏపీలో తెదేపా కార్యాలయాలపై వైకాపా కార్యకర్తలు దాడి చేయడం మంచిది కాదని ఏపీ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు...

Updated : 20 Oct 2021 16:40 IST

కడప: ఏపీలో తెదేపా కార్యాలయాలపై వైకాపా కార్యకర్తలు దాడి చేయడం మంచిది కాదని ఏపీ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. భాజపా తరఫున ఇలాంటి అనైతిక సంఘటనలను ఖండిస్తున్నట్లు తెలిపారు. రాజకీయ పార్టీలు మాట్లాడే భాష విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. తెదేపా చేసిన ఆరోపణలపై డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ స్పందించారు కానీ వైకాపా చేసిన భౌతిక దాడులపై స్పందించలేదన్నారు. ఇలాంటి విషయాల్లో డీజీపీలో మార్పు రావాలని సోము వీర్రాజు అన్నారు. కడపలోని విజయదుర్గమ్మ దేవాలయాన్ని సందర్శించిన ఆయన ఈ మేరకు మీడియాతో మాట్లాడారు. నిన్న సాయంత్రం తెదేపా కేంద్ర కార్యాలయంతో పాటు ఏపీలోని ఆ పార్టీ కార్యాలయాలపై పలువురు వ్యక్తులు దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు