AP BJP Protest: వినాయక ఉత్సవాలకు అనుమతివ్వాల్సిందే: ఏపీలో భాజపా నిరసనలు

మండపాల్లో వినాయకచవితి ఉత్సవాలకు అనుమతివ్వాలని డిమాండ్‌ చేస్తూ ఏపీ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భాజపా శ్రేణులు

Updated : 06 Sep 2021 14:43 IST

అమరావతి: మండపాల్లో వినాయకచవితి ఉత్సవాలకు అనుమతివ్వాలని డిమాండ్‌ చేస్తూ ఏపీ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భాజపా శ్రేణులు ఆందోళనలకు దిగాయి. జిల్లా కలెక్టరేట్లు, ఇతర ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. విశాఖపట్నం, విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు, ఒంగోలు, కడప తదితర చోట్ల కలెక్టరేట్లు, సబ్‌కలెక్టరేట్ల ముట్టడికి శ్రేణులు యత్నించాయి. 

విశాఖలో భాజపా నేతలు గణేశుడి విగ్రహాన్ని తలపై పెట్టుకుని కలెక్టరేట్‌లోకి దూసుకెళ్లారు. ఈ క్రమంలో పోలీసులు వారిని అడ్డుకునేందుకు యత్నించడంతో తోపులాట చోటుచేసుకుంది. అనంతరం ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. విశాఖ కలెక్టరేట్‌ ముట్టడి కార్యక్రమంలో రాష్ట్ర సాధు పరిషత్‌ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి, విశ్వహిందూ పరిషత్ నేతలు పాల్గొన్నారు. వినాయక మండపాల్లో కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ పూజలు నిర్వహిస్తామని.. అనుమతించాలని ఆందోళనకారులు డిమాండ్‌ చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని