Updated : 03 Nov 2021 15:28 IST

Ap News: సంస్కృతి, సంప్రదాయాలు గుర్తు చేసేలా ‘ధర్మపథం’: వెల్లంపల్లి

విజయవాడ: దేవాదాయశాఖలో సంస్కరణలు చేపట్టినట్లు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ తెలిపారు. ఆలయాల్లో గోశాలల అభివృద్ధికి ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. సంస్కృతి, సంప్రదాయాలు గుర్తు చేసేలా త్వరలో ధర్మపథం కార్యక్రమాన్ని తీసుకురానున్నట్లు వెల్లడించారు. అన్యాక్రాంతమైన దేవాదాయ భూముల రికవరీకి ప్రయత్నాలు ముమ్మరం చేశామన్నారు. ఆలయాల వద్ద ఎక్కువగా అన్యమత ప్రచారం జరగడం లేదని మంత్రి స్పష్టం చేశారు. ఇటీవల శ్రీశైలం, తిరుపతిలో జరిగిన ఘటనలపై చర్యలు తీసుకున్నామన్నారు. దేవాలయ ఆస్తుల లీజు వసూలు విషయంలో కఠినంగానే వ్యవహరిస్తున్నట్లు పేర్కొన్నారు. దుకాణాలు, భూముల నుంచి వారిని ఖాళీ చేయిస్తామన్నారు.

Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్