Mansas trust: ఎదురుదెబ్బలు తగిలినా ప్రభుత్వానికి బుద్ధి రావడం లేదు: అశోక్‌గజపతిరాజు

మాన్సాస్‌ ట్రస్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అతిగా జోక్యం చేసుకుంటోందని ట్రస్టు ఛైర్మన్‌ అశోక్‌గజపతిరాజు ఆరోపించారు. మాన్సాస్‌ ట్రస్టు ఛైర్మన్‌గా అశోక్‌గజపతిరాజును

Published : 12 Aug 2021 01:33 IST

విజయనగరం: మాన్సాస్‌ ట్రస్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అతిగా జోక్యం చేసుకుంటోందని ట్రస్టు ఛైర్మన్‌ అశోక్‌గజపతిరాజు ఆరోపించారు. మాన్సాస్‌ ట్రస్టు ఛైర్మన్‌గా అశోక్‌గజపతిరాజును నియమిస్తూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం, సంచయిత గజపతిరాజు, ఊర్మిళ గజపతిరాజులు దాఖలు చేసిన అనుబంధ పిటిషన్లను హైకోర్టు కొట్టేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన అశోక్‌.. హైకోర్టు తీర్పును మరోసారి స్వాగతిస్తున్నట్లు చెప్పారు. అనేక ఎదురుదెబ్బలు తగిలినా ప్రభుత్వానికి బుద్ధి రావడం లేదని వ్యాఖ్యానించారు. ఇష్టానుసారం నియామకాలు చేపట్టి ట్రస్టు ప్రతిష్టను దెబ్బతీసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టు ఆదేశించినా ఇప్పటివరకు ఈవో తనను కలవలేదని.. తన ఆదేశాలను పట్టించుకోవడం లేదని తెలిపారు. ట్రస్టు ఛైర్మన్‌గా సంచయిత గజపతిరాజు చేసింది తక్కువ.. హడావుడి ఎక్కువ అని ఎద్దేవా చేశారు. ఆర్భాటం కోసం రూ.కోటి ట్రస్టు నిధులతో కార్లు కొన్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ విచారణ కమిటీపై తనకేమీ ఆందోళన లేదని అశోక్‌ గజపతిరాజు స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని