Mekathoti Sucharita: దిశ చట్టాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవద్దు: సుచరిత

మహిళల భద్రత కోసం చిత్తశుద్ధితో ‘దిశ’ చట్టాన్ని తీసుకొస్తే తెదేపా నేతలు ఆ చట్టాన్ని అవహేళన చేయటం తగదని రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత అన్నారు

Updated : 02 Sep 2021 15:50 IST

అమరావతి: మహిళల భద్రత కోసం చిత్తశుద్ధితో ‘దిశ’ చట్టాన్ని తీసుకొస్తే తెదేపా నేతలు ఆ చట్టాన్ని అవహేళన చేయటం తగదని రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దిశ పోలీస్ స్టేషన్ల ముందు తెదేపా నేతలు ఆందోళనలకు పిలుపునివ్వడాన్ని ఆమె తప్పుబట్టారు. రాష్ట్రపతి ఆమోదముద్ర పడగానే చట్టాన్ని అమలు చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. దిశ యాప్ ద్వారా అనేక మంది మహిళలు రక్షణ పొందుతున్నారన్నారు. తెదేపా అధికారంలో ఉండగా మహిళా తహసీల్దార్ వనజాక్షిపై ఎమ్మెల్యే దాడి చేసినా పట్టించుకోలేదని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు మహిళలపై దాడి జరిగితే ఏడు రోజుల్లోనే ఛార్జ్ షీట్ దాఖలు చేస్తున్నామని వివరించారు. దిశ చట్టం అమల్లోకి రాకపోయినా అదే స్ఫూర్తితో పని చేస్తున్నట్లు చెప్పారు. మహిళల రక్షణ కోసం సలహాలిస్తే స్వీకరిస్తామని.. అంతేగాని దిశ చట్టాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవద్దని తెదేపా నేతలకు సూచించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు