AP News: ప్రజలు హర్షిస్తుంటే హీరోలకు కడుపుమంట ఎందుకు?: అనిల్‌ యాదవ్‌

కొడాలి నాని తప్ప తమకు ఏ నానీ తెలియదని ఏపీ మంత్రి అనిల్‌ కుమార్ యాదవ్‌ వ్యాఖ్యానించారు.

Updated : 24 Dec 2021 14:08 IST

నెల్లూరు: సినీ పరిశ్రమలో దోపిడీని అరికట్టేందుకే ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఏపీ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ అన్నారు. సినిమా ఖర్చులో 70 శాతం హీరోల రెమ్యూనరేషనే ఉంటోందని.. దాన్ని తగ్గించుకోవచ్చు కదా అని హీరోలను ఆయన ప్రశ్నించారు. నెల్లూరులో మీడియాతో ఆయన మాట్లాడారు. టికెట్‌ ధరల అంశంలో సినీ నటుడు నాని గురువారం చేసిన వ్యాఖ్యలపై విలేకర్లు ప్రశ్నించగా ఆయనో భజనపరుడని అనిల్‌ వ్యాఖ్యానించారు.  

ప్రభుత్వ నిర్ణయంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని అనిల్‌ చెప్పారు. ప్రజలు హర్షిస్తుంటే హీరోలకు కడుపుమంట ఎందుకని ప్రశ్నించారు. ఎక్కడ రెమ్యూనరేషన్‌ తగ్గిపోతుందోననే బాధ హీరోలదని చెప్పారు. రెమ్యూనరేషన్‌కి అయ్యే ఖర్చును ప్రజలపై రుద్దడం ఎంతవరకు కరెక్టో చెప్పాలన్నారు. వకీల్‌సాబ్‌, భీమ్లానాయక్‌ సినిమాలకు అయిన ఖర్చెంత? పవన్‌ కల్యాణ్‌ రెమ్యూనరేషన్‌ ఎంత? అని ప్రశ్నించారు. అభిమానిగా కటౌట్లు కట్టి తానూ నష్టపోయానని అనిల్‌ యాదవ్‌ వ్యాఖ్యానించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని