Updated : 31/08/2021 22:07 IST

Buggana Rajendranath: పేదలను కాపాడేందుకే అప్పులు: ఏపీ మంత్రి బుగ్గన

దిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి సమావేశమయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్‌ నిధులపై చర్చించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..  అన్‌రాక్‌ కంపెనీ ఐసీజేలో వేసిన కేసుపై కేంద్ర మంత్రితో చర్చించినట్టు తెలిపారు. అన్‌రాక్‌ సంస్థకు అవసరమైన బాక్సైట్‌ సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని కోరామని, కేసు పరిష్కారమైతే రాష్ట్రానికి పెద్ద కంపెనీ వస్తుందని చెప్పారు. 2008లో అప్పటి సర్కారు అన్‌రాక్‌కు బాక్సైట్‌ సరఫరా చేయలేకపోయిందన్నారు. ఐఐఎఫ్‌టీ, ఐఐపీ ఏర్పాటుకు రాష్ట్రం ఇప్పటికే స్థలం కేటాయించిందన్నారు. ఏపీలో విద్య, నైపుణ్య శిక్షణ సంస్థలు ఎక్కువ ఉండాలనేది సీఎం ఉద్దేశమని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం చేసే అప్పులపై తెదేపాది అనవసర రాద్ధాంతమని విమర్శించారు. అప్పులపై తెదేపా నేతలు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కరోనా కష్టకాలంలో పేదలను కాపాడేందుకు అప్పులు తెచ్చామని బుగ్గన వివరించారు.


Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని