Buggana rajendranath reddy:  ప్రజల ఖాతాల్లో రూ.1.05లక్షల కోట్లు జమ చేశాం: ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన

ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక పరిస్థితి, ప్రతిపక్షాల విమర్శలపై రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి స్పందించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరిస్తూ శనివారం ఓ ప్రకటన విడుదల

Updated : 04 Sep 2021 20:43 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక పరిస్థితి, ప్రతిపక్షాల విమర్శలపై రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి స్పందించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరిస్తూ శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. కరోనా కట్టడికి రూ.7,130 కోట్లకు పైగా ఖర్చు చేశామన్నారు. పరిమితికి లోబడి అప్పులు చేస్తున్నట్టు స్పష్టంచేశారు. కరోనా వల్ల  రాష్ట్ర రాబడి తగ్గలేదన్న ప్రతిపక్షాల వాదనలు అర్ధరహితంగా ఉన్నాయన్నారు. ‘‘ఏడాదిగా పన్ను పెరుగుదల లేక రూ.7,947 కోట్ల ఆదాయం కోల్పోయాం. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు రూ.లక్షా 27వేల కోట్లు అప్పులు చేసింది. ఇప్పటివరకు వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి ప్రజల ఖాతాల్లో రూ.లక్షా 5వేల కోట్లు జమచేశాం. జీఎస్‌డీపీలో అదనంగా 2శాతం అప్పు తీసుకొనేందుకు కేంద్రం అనుమతించింది’’ అని బుగ్గన తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని