
జగన్ సీఎంగా ఉన్నంత వరకు నన్నెవరూ ఏమీ చేయలేరు: ఏపీ మంత్రి జయరాం
అమరావతి: దాదాగిరీ చేయడానికి తానేమీ అంతర్రాష్ట్ర స్మగ్లర్ వీరప్పన్ను కాదని ఏపీ మంత్రి గుమ్మనూరు జయరాం వ్యాఖ్యానించారు. తన నియోజకవర్గంలోని ఆస్పరి పరిధిలో పోలీసులు ఖాళీ ఇసుక ట్రాక్టర్లు పట్టుకుంటే వదిలేయమని చెప్పానన్నారు. ఆస్పరి ఎస్సైతో మొబైల్ ఫోన్లో మంత్రి మాట్లాడిన మాటలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో అమరావతిలో సీఎం జగన్ను మంత్రి జయరాం కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆస్పరి ఎస్సైతో జరిగిన ఫోన్ సంభాషణపై వివరణ ఇచ్చారు.
‘‘పోలీసులతో దౌర్జన్యంగా మాట్లాడి ఉంటే నాది తప్పు. నేను చెప్పినదాంట్లో ఎక్కడైనా దౌర్జన్యంగా మాట్లాడినట్లు ఉందా? రైతుల ఖాళీ ట్రాక్టర్లు వదిలేయాలని మాత్రమే చెప్పాను. నాపై బురదచల్లే కార్యక్రమం పెట్టుకోవద్దు. సీఎంను కలిసి నియోజకవర్గ సమస్యలపైనే మాట్లాడాను. అక్కడ ఇతర అంశాలేవీ ప్రస్తావనకు రాలేదు. నా నియోజకవర్గాన్ని ఆనుకునే కర్ణాటక సరిహద్దు ఉంటుంది. మద్యం ఏరులై పారుతుంటే నేనేం చేయగలను?నేనేమైనా అదే పనిగా కాచుకుని కూర్చుంటానా? జగన్ సీఎంగా ఉన్నంత వరకు నన్నెవరూ ఏమీ చేయలేరు’’ అని మంత్రి వ్యాఖ్యానించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.