Perni Nani: చిరంజీవి విజ్ఞప్తిని జగన్‌ దృష్టికి తీసుకెళ్లాం: పేర్ని నాని

రాష్ట్రంలో సినిమా టికెట్ల రేట్ల పెంపు అంశంపై పరిశీలన చేసి నిర్ణయం తీసుకుంటామని ఏపీ మంత్రి పేర్ని నాని తెలిపారు.

Updated : 26 Nov 2021 15:25 IST

అమరావతి: రాష్ట్రంలో సినిమా టికెట్ల రేట్ల పెంపు అంశంపై పరిశీలన చేసి నిర్ణయం తీసుకుంటామని ఏపీ మంత్రి పేర్ని నాని తెలిపారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా టికెట్ల పెంపుపై సీఎంతో చర్చించి నిర్ణయిస్తామని.. ఈ విషయాన్ని సినీ పెద్దలకు స్పష్టం చేశామన్నారు. టికెట్ల ధరలపై ప్రముఖ సినీనటుడు చిరంజీవి చేసిన విజ్ఞప్తిని సీఎం జగన్‌ దృష్టికి తీసుకెళ్లామన్నారు. అసెంబ్లీ సమావేశాలు, వరదల సమీక్షపై సీఎం తీరిక లేకుండా ఉన్నారని.. త్వరలోనే ఆయన ఓ నిర్ణయం తీసుకుంటారని పేర్ని నాని చెప్పారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని