AP News: స్థానిక ఎన్నికల ఫిర్యాదుల పరిష్కారానికి కాల్‌ సెంటర్‌

స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా ఫిర్యాదుల పరిష్కారంపై రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ప్రజలు, అభ్యర్థులు ఫిర్యాదులు చేసేందుకు విజయవాడలోని

Published : 03 Nov 2021 21:02 IST

అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా ఫిర్యాదుల పరిష్కారంపై రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ప్రజలు, అభ్యర్థులు ఫిర్యాదులు చేసేందుకు విజయవాడలోని ఎస్‌ఈసీ కార్యాలయంలో కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేశారు. ఎన్నికలకు సంబంధించి అవకతవకలు, అక్రమాలపై ఫిర్యాదు చేయడం సహా సందేహాల నివృత్తికోసం కాల్‌ సెంటర్‌కు ఫిర్యాదు చేయవచ్చని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ప్రజలు 0866 2466877 నెంబర్ కు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ఈ మెయిల్ ఐడీ apsec.callcenter@gmail.com కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు పంపవచ్చని ఎన్నికల సంఘం తెలిపింది. ప్రజలు ఖచ్చితమైన, తగిన ఆధారాలతో ఫిర్యాదులు చేస్తే నిర్ణీత సమయంలో పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. కాల్ సెంటర్ లో ఫిర్యాదును రిజిస్టర్ చేయించుకుని పరిష్కారం పొందవచ్చని ఎస్ఈసీ ప్రకటనలో తెలిపారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని