AP Politics: తప్పుడు కేసులతో ఎఫ్ఐఆర్ పుస్తకాలన్నీ నిండిపోయాయి: అచ్చెన్నాయుడు

ఏపీలో వైకాపా రెండేళ్ల పాలనలో తెదేపా శ్రేణులపై నమోదు చేసిన తప్పుడు కేసులతో ఎఫ్ఐఆర్ పుస్తకాలన్నీ

Updated : 13 Sep 2021 12:33 IST

అమరావతి: ఏపీలో వైకాపా రెండేళ్ల పాలనలో తెదేపా శ్రేణులపై నమోదు చేసిన తప్పుడు కేసులతో ఎఫ్ఐఆర్ పుస్తకాలన్నీ నిండిపోయాయని తెదేపా ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. కొందరు పోలీసుల వ్యవహారశైలి శృతి మించుతోందన్నారు. ‘‘పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసినందుకు తెదేపా కార్యకర్త అంజిపై కడప జిల్లా చిన్నమండెం పోలీసులు అక్రమ కేసులు పెట్టడంతో పాటు కొట్టి హింసించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.

కండ్రికలో వైకాపా కార్యకర్తలు తెదేపా కార్యకర్తలపై దాడి చేస్తే బాధితులనే ఇబ్బంది పెడుతున్నారు. తప్పుడు కేసు పెట్టిన పోలీసు అధికారి పేర్లను రాసుకుంటున్నాం. భవిష్యత్‌లో వారు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. కొందరి తీరు పోలీస్‌ వ్యవస్థకు చెడ్డపేరు తెస్తోంది. పోలీసులు ఇకనైనా పద్ధతి మార్చుకొని చట్టం ప్రకారం నడుచుకోవాలి’’ అని అచ్చెన్నాయుడు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని