AP News: ఆ ఆడియో టేపులపై విచారణ అవసరం: వాసిరెడ్డి పద్మ

ఏపీలో ఇటీవల పలువురు అధికార పార్టీ నేతలకు సంబంధించినవిగా పేర్కొంటున్న ఆడియో టేపులపై విచారణ అవసరం ఉందని రాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ అన్నారు. ఆడియో టేపుల్లోని మాటలు తమవి కావని

Updated : 22 Aug 2021 15:08 IST

అమరావతి: ఏపీలో ఇటీవల పలువురు అధికార పార్టీ నేతలకు సంబంధించినవిగా పేర్కొంటున్న ఆడియో టేపులపై విచారణ అవసరం ఉందని రాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ అన్నారు. ఆడియో టేపుల్లోని మాటలు తమవి కావని నేతలు అంటున్నారని.. ఈ వ్యవహారంపై వారిని విచారణ కోరతామన్నారు. మహిళా కమిషన్‌ తరఫున సమాచారం తెప్పించుకుంటామని తెలిపారు. అసభ్యకర ప్రవర్తనపై మహిళా కమిషన్‌ చూస్తూ ఊరుకోదని పద్మ స్పష్టం చేశారు. మరో వైపు ఇటీవల గుంటూరులో నడిరోడ్డుపై హత్యకు గురైన ఎస్సీ యువతి రమ్య ఘటనపై కూడా ఆమె స్పందించారు. ఘటనపై తెదేపా 21 రోజుల డెడ్‌లైన్‌ సరికాదన్నారు. నిందితులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వివరించారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని